ప్రెగ్నెంట్ అని కూడా చూడ‌లేదు.. దారుణంగా హింసించారు.. కాజ‌ల్ సంచ‌ల‌న కామెంట్స్‌!

తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్‌ ముద్ర వేయించుకున్న హీరోయిన్లలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒక‌టి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అగ్ర హీరోలతో ఆడి పాడిన కాజ‌ల్‌.. ఫామ్ లో ఉండగానే పెళ్లి పీటలెక్కింది. 2020లో ప్రియా సఖుడు, ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి అయిన కొద్ది నెలలకే గర్భం దాల్చింది.

ప్రెగ్నెంట్ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. పండంటి గ‌త‌ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డ‌కు ఆరు నెలల వయసు రాగానే మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న కాజ‌ల్‌.. తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రెగ్నెన్సీ సమయంలో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల గురించి మాట్లాడుతూ సంచలన‌ కామెంట్స్‌ చేసింది.

ప్రెగ్నెన్సీ టైమ్ లో చాలామంది విమర్శలు గుప్పించారని.. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా లావుగా అయ్యావు అంటూ విమర్శించారని.‌. బాడీ షేమింగ్‌ కామెంట్స్ తో దారుణంగా హింసించారని కాజల్ పేర్కొంది. అలాగే బిడ్డ పుట్టిన‌ కొద్ది రోజులకే నటించడానికి సిద్ధం అయ్యాన‌ని కొందరు నోటికొచ్చిన‌ట్లు వాగార‌ని ఆవేదన వ్యక్తం చేసింది. నా కొడుకును ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది గొప్పతల్లిగా నిలవాలి.. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల‌ని అని అప్పుడే నిర్ణ‌యించుకున్నా అంటూ కాజ‌ల్ పేర్కొంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈ బ్యూటీ బాలయ్యతో `ఎన్‌బీకే 108`, త‌మిళం లో కమల్ హాసన్ తో `ఇండియన్ 2` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

Share post:

Latest