డిజె టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ లో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు.. ఈ సినిమా కన్నా ముందు పలు సినిమాల్లో నటించిన సిద్దు.. అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. డీజే టిల్లు సినిమాతో ఒకసారిగా స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డిజే టిల్లు సీక్వెల్ లో నటిస్తున్నాడు.
అయితే ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ తర్వాత సినిమాల గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. సమంతతో సిద్దు నటించబోతున్నారని ఈ సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తారని తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో సిద్దు సినిమా అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాను రామ్ తాళ్లూరి నిర్మంచిబోతున్నారని తెలుస్తుది.
సమంత కూడా ప్రస్తుతం తన కెరీర్‌లో వరుస అపజయాలను మూట కొట్టుకుంటుంది. దీంతో ఎలాంటి సినిమాకైనా సమంత ఓకే చెప్పేస్తుంది. ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోలకు జోడీగా నటించిన ఆమె ఇప్పటికే విజయ్ దేవరకొండ తో ఖుషి చేస్తోంది. ఇక ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డకు కూడా ఓకే చెప్పేసింది.
మరీ సమంత ఈ స్థాయిలో దిగజారి పోయిందని ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా వచ్చిన శకుంతలం సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుని తన కెరీర్ ను పాతాళానికి నెట్టేసుకుంది. ఇక మరి సమంత సిద్దు సినిమాతో అయినా హిట్ అందుకుంటారో లేదో చూడాలి.