పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కీర్తి సురేష్‌.. కాబోయే వాడితో ద‌ర్శ‌న‌మిచ్చి షాకిచ్చిన మ‌హాన‌టి!

గత కొన్నాళ్లుగా మహానటి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతోందని పలుమార్లు వార్తలు వ‌చ్చాయి. ఈ వార్తలను కీర్తి సురేష్ తల్లి ఖండిస్తూనే వ‌చ్చారు. అయితే తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి టాపిక్‌ తెరపైకి వచ్చింది.

మహానటి పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా కీర్తి సురేష్‌ ఓ వ్య‌క్తిగా చాలా స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి చూసి కీర్తి సురేష్ కు కాబోయే వాడు అత‌డే అంటూ ప్రచారం జరుగుతోంది. స‌ద‌రు వ్య‌క్తి వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. అత‌ని పేరు పర్హాన్ బీన్ లియాకత్ ఈయనొక రియల్ ఎస్టేట్ వ్యాపారి.

ఇటీవ‌ల పర్హాన్ బ‌ర్త్‌డే కావ‌డంతో.. అత‌డితో క్లోజ్ దిగిన ఫోటోల‌ను కీర్తి సురేష్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసి విషెస్‌ తెలిపింది. దీంతో ప‌ర్హాన్ తో చాలా కాలం నుంచి కీర్తి సీక్రెట్ రిలేష‌న్ లో ఉంద‌ని.. త్వ‌ర‌లోనే అత‌డితో ఏడ‌డుగులు వేయ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. రీసెంట్ గా `ద‌స‌రా` మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న కీర్తి ప్ర‌స్తుతం తెలుగులో భోళా శంక‌ర్ సినిమా చేస్తోంది. అలాగే త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప‌లు ప్రాజెక్ట్‌ల‌కు క‌మిట్ అయింది.