ఆది పురుష్ చిత్రంపై శాకుంతలం సినిమా ఎఫెక్ట్..!!

సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఈ చిత్రం శాకుంతల, దుష్యంతుడి కథ అంశంతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత భారీ డిజాస్టర్ టాక్ ని మూటకట్టుకుంది. పెట్టుబడిలో 10% కూడా తిరిగి రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా దిల్ రాజు గుణశేఖర్ కు ఈ సినిమా భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు.

Adipurush teaser poster: Prabhas looks terrific as Lord Rama | 123telugu.com

ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడాలని వారం రోజుల క్రితం నుంచి ఈ సినిమా స్పెషల్ ప్రీమియం షోలు వేయడం జరిగింది. ఈ ప్రీమియర్ షో లు కారణంగా శాకుంతలం సినిమా పైన నెగెటివిటీ ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఇదే భయం కూడా ఆది పురుష్ సినిమాకు దర్శక నిర్మాతలకు టెన్షన్ కు గురిచేసింది.. వాస్తవానికి ఆది పురుష్ సినిమా జూన్ 13న స్పెషల్ ప్రీమియర్ షోలు వేయాలని డిసైడ్ అయింది చిత్ర బృందం. తద్వారా ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేయవచ్చని భావించారు..

అయితే ఈ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం కావడంతోపాటు రామాయణం కథ ఆధారంగా అది పురుష్ సినిమాని తెరకెక్కించారు. జూన్ 11న ప్రీమియర్ ఈవెంట్ తిరుపతిలో చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత జూన్ 16న మిడ్ నైట్ ప్రీమియర్ షోలతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు తీసుకువెళ్లాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా శాకుంతలం సినిమా ప్రీమియర్ దెబ్బతో ఆది పురుష్ టీమ్ కూడా జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది.

Share post:

Latest