అదే కాపురాన్ని కూల్చేసింది.. హాట్ టాపిక్ గా మారిన స‌మంత పోస్ట్‌!

దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న నాగ చైతన్య-సమంతలు 2017లో పెద్దలను ఒప్పించి గోవా వేదికగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. ఏడాది క్రితం ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే విడాకులకు కారణం ఏంటి అనేది ఇద్దరు వేలాడించలేదు.

అయితే తాజాగా `క‌స్ట‌డీ` ప్ర‌మోష‌న్స్ లో ఈ విషయంపై నాగచైతన్య తొలిసారి నోరు విప్పాడు. విడాకుల‌కు కార‌ణాన్ని వెల్ల‌డించాడు. `మేమిద్దరం విడిపోయి రెండేళ్లు గడించింది. ఏడాది కిందనే చట్టపరంగా విడాకులు కూడా వ‌చ్చాయి. మేం విడిపోయినా ఆమెతో కలిసి ఉన్న రోజులను చాలా గౌరవిస్తున్నాను. అసలు మేం విడిపోవడానికి కారణం పుకార్లే.

సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు, మీడియాలో వచ్చిన కొన్ని వార్తల కారణంగానే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. క్ర‌మంగా ఆ గొడ‌వ‌లు పెద్దగా మారాయి. అవి కాస్తా డివోర్స్ దాకా వెళ్లాయి. విడిపోవాల్సి వచ్చింది` అంటూ చైతు పేర్కొన్నాడు. ఇదే స‌మ‌యంలో స‌మంత పెట్టిన తాజా పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. `మ‌న‌మంతా ఒక‌టే. కేవ‌లం అహంకారం, భ‌యాలే మ‌న‌ల్ని దూరం చేస్తాయి` అంటూ కొటేష‌న్ ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. చైతు కామెంట్స్ అనంత‌రం సామ్ ఈ విధంగా పోస్ట్ పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈగోనే చైతు-సామ్ కాపురాన్ని కూల్చేసిందా.. అందుకే ఇద్ద‌రూ దూరం అయ్యారా.. అంటూ నెటిజ‌న్లు చ‌ర్చ‌లు షురూ చేశారు.

Share post:

Latest