శాకుంతలం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ చిత్రం శాకుంతలం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య గత నెల 14వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని కి నిర్మాతగా నీలిమ గుణం ఉండగా దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించడం జరిగింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించాడు.

Shaakuntalam Movie Review: Samantha's film is all heart but no soul - India  Today
ఈ చిత్రంలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటించింది. బాల భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు నటనకు మంచి ప్రశంసలు అందుకున్నాయి. థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శాకుంతలం సినిమా ఇప్పుడు ఓటీటి లో విడుదల కాబోతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కును ప్రముఖ ఓటీపీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ముందు భారీ అంచనాలు ఉండడంతో రూ.20 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ను కొనుగోలు చేసినట్లు సమాచారం.

శాకుంతలం సినిమా నిరాశపరచడంతో విడుదలైన నెల రోజులలోకి ఓటీటి లోకి వస్తోంది. ఈనెల 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రిమింగ్ కాబోతోంది. ఇందులో మోహన్ బాబు, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్ ,వర్షిని తదితరులు నటించారు. కథ బాగున్నప్పటికీ వీఎఫ్ ఎక్స్ లోపంతో శాకం తలం సినిమా ఫ్లాప్ గా నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఓటీటి లోనైనా ఈ సినిమా ఆకట్టుకుంటుందేమో చూడాలి మరి.

Share post:

Latest