సమంతతో గొడవలపై ఫస్ట్ టైం నోరు విప్పిన నాగ చైతన్య..!!

నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కష్టడి ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈసారి నాగచైతన్య ఇందులో మాస్ పాత్రలో కానిస్టేబుల్ గా కనిపించబోతున్నారు. తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించడం జరిగింది. సమంత తాను విడిపోయి రెండేళ్లు అవుతున్న వారు ఎందుకు విడిపోయారు అన్న విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగినట్లు తెలుస్తోంది.వాటి గురించి తెలుసుకుందాం.

Samantha Ruth Prabhu Decided To Bury Hard Feelings, To Reconnect With Naga  Chaitanya After Divorce
చైతు మాట్లాడుతూ చట్టపరంగా విడాకులు తీసుకొని ఒక ఏడాది అవుతోందని అంటున్నారు సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల కారణంగా మా ఇద్దరి మధ్య పలు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయని చైతన్య తెలిపారు.. అయితే సమంతది చాలా మంచి మనసు ఆమె ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని తెలియజేశారు.అనవసరమైన వదంతులు కారణంగా ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు ప్రజల్లోకి వెళ్ళింది. అది నన్ను ఎక్కువగా బాధ పెట్టింది.. అలాగే తన గతంలో సంబంధం లేని ఒక వ్యక్తిని మధ్యలోకి తీసుకువచ్చి వారిని ఆ గౌరవపరిచారు. అలాగే తాను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి వ్యక్తిగత విషయాల పైన ప్రశ్నిస్తూ పెళ్లి గురించి అడుగుతున్నారు.. సంబంధం లేని కొన్ని విషయాలు ఇలాంటి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని చైతన్య ఇంటర్వ్యూలో తెలిపారు.

సమంతతో చైతన్య స్నేహపూర్వకంగానే విడాకులు తీసుకున్నామని ఆమె కెరీర్ ని నిర్ణయాలని గౌరవిస్తానని తెలిపారు చైతు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇదంతా సోషల్ మీడియా సృష్టి అంటూ చైతన్య తెలిపారు. మొత్తానికి చాలా కాలం తర్వాత సమంత నాగచైతన్య మధ్య తీవ్రస్థాయిలో వైర్యం నడుస్తోంది అని ప్రచారం జరుగుతోంది ఇలాంటి వార్తలు అన్ని కూడా కేవలం రూమర్లే అని తేలిపోయింది.

Share post:

Latest