తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందింది నటి అనసూయ. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకపక్క సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండగానే అప్పుడప్పుడు పలు రకాలుగా కామెంట్లు చేసి ట్రోల్ కు గురవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న అనసూయ బుల్లితెరకు కూడా గుడ్ బై చెప్పింది. గత కొద్దిరోజులుగా అనసూయ ఆంటీ అనే వివాదం పెను సంచలనాన్ని సృష్టించింది.
ఇప్పుడు వున్న పరిస్థితుల ను బట్టి చూస్తే ట్రోల్ అనే పదానికి అనసూయ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అయితే మొదటి నుంచి అనసూయకి హీరో విజయ్ దేవరకొండక మధ్య ఎప్పుడూ ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ కిస్ నుంచి మొదలైన ఈ వివాదం ఇప్పటివరకు రగులుతూనే ఉంది. అనసూయ ట్విట్టర్ లో ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు మరొకసారి అనసూయ విజయ్ దేవరకొండ పైన ట్విట్ చేసి మరోక కొత్త వివాదానికి తెర లేపేలా చేసింది.
తాజాగా తన ట్విట్టర్ ఖాతా లో షేర్ చేస్తూ.. ఇప్పటికే ఒకటి చూశాను.. ది..నా ..? బాబోయ్ పైత్యం ఏం చేస్తాం అంటకుండా చూసుకుందామని రాసుకుంది.. అయితే అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్ పై విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని ఉంటుంది.. ది విజయ్ దేవరకొండ అని రాసి ఉంటుంది ఇది చూసిన అనసూయ ఈ ట్వీట్ చేసిందని పలువురు నేటిజెన్లు తెలియజేస్తున్నారు. దీంతో అనసూయని కొంతమంది ట్రోలర్స్.. దీన్ని నువ్వు ట్రెండ్ చేస్తే ఆంటీ అని మరొక సారి మేము ఫ్రెండ్ చేస్తామంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam 🙊
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023