తాజాగా ఏపీలో రాజకీయాలు పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఒకరు మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీద ఎవరైనా పాపం పసివాడు అనే సినిమా తీయాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సెటైర్లు వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్వీట్ కి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.
రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా.. పవన్ కళ్యాణ్ ఈ పాపం పసివాడు అనే సినిమా జగన్ తో కాకుండా నీతో కూడా ఎవరైనా చేస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నాను.. ఎందుకంటే అజ్ఞానంతో కూడిన అమాయకత్వం నీది.. అమాయకత్వంతో కూడిన దద్దమ్మ నువ్వు.. నీ మీద ఈ సినిమా తీయాలని నేను ఆశిస్తున్నాను అంటూ చాలా దారుణంగా కామెంట్లు చేశారు. అంతేకాదు ఇక్కడ ఒక చిన్న మార్పు చేయాలి అని.. ఆ ఒక్క పాత్ర మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ తో బాధపడుతూ అనే పాత్రలుగా కనిపించేలా నీ పాత్ర మార్చాలి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వర్మ.
అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ పేరును ట్యాగ్ చేస్తూ.. నువ్వు ఎన్టీ రామారావు కాదు.. అలాగని ఎంజీఆర్ కూడా కాదు.. నీకు ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు.. నువ్వు ప్రజాసేవ అనే ముసుగులో దురుద్దేశంతోనే అమాయకపు అభిమానులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నావు.. ఏదో ఒక రోజు మీ జన సైనికులే నీ నుండి విముక్తి పొందుతారని ఆశిస్తున్నాను అంటూ వర్మ విరుచుకుపడ్డాడు.. అలాగే పవన్ కళ్యాణ్ రాసినట్టుగానే అదే రీతిలో ట్వీట్ చేస్తూ.. చివర్లో .. ఈ కథనానికి రాజస్థాన్ ఎడారిలోని ఇసుక దిబ్బలు కావాలి.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అపద్దాలు విసరడానికి మీకు హైదరాబాద్ అవసరం అంటూ ట్వీట్ చేశారు. దీనిపై కూడా చాలామంది రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
I hope someone makes this film with you too ,because you are ignorantly innocent and innocently naive. Only a small change is needed here: instead of playing a character play it with multiple characters in one character amounting to a multiple personality disorder ..Dear Not… https://t.co/D8oC1SHTDM
— Ram Gopal Varma (@RGVzoomin) May 17, 2023