క‌ళ్లు చెదిరే రేంజ్ లో `ఆదిపురుష్‌` తెలుగు బిజినెస్‌.. అమ్మ బాబోయ్ అన్ని కోట్లా..?

వ‌చ్చే నెల‌లోనే `ఆదిపురుష్‌` ఆగ‌మ‌నం. జూన్ 16న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల కాబోతోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మైథిలాజికల్ మూవీతో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

టీసిరీస్, రెట్రోఫైల్స్ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు. టీజ‌ర్ విడుద‌ల స‌మ‌యంలో ఎన్నో విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న ఈ చిత్రం.. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత ప‌రిస్థితి మొత్తం తారుమారు అయిపోయింది. ట్రైల‌ర్ ద్వారా ఈ సినిమాపై ఊహించిన దానికంటే ఎక్కువ హైప్ క్రియేట్ అయింది. అభిమానులే కాకుండా సినీ ప్రియుల్లోనూ ఈ సినిమాపై ఆస‌క్తి పెరిగింది.

మ‌రోవైపు బిజినెస్ కూడా క‌ళ్లు చెదిరే రేంజ్ లో జ‌రుగుతుంద‌ని అంటున్నారు. తాజాగా `ఆదిపురుష్‌` తెలుగు బిజినెస్ క్లోజ్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏరియాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ద‌క్కుంచుకుంద‌ట‌. ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా రూ. 125 కోట్లు వెచ్చించిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఇదే నిజ‌మైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ అవుతుంది.

Share post:

Latest