`సింహాద్రి` సంచ‌ల‌నం.. రీ రిలీజ్ లో ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలిస్తే మైండ్ బ్లాకే!

మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో మైల్‌స్టోన్‌గా నిలిచిన `సింహాద్రి` సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ నిన్న థియేటర్స్ లో సందడి చేసింది.

ఇండియా వైడ్ గానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, కెనెడా, జపాన్, మలేషియాలలో సైతం ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. అన్ని చోట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో థియేట‌ర్లు క‌ల‌క‌ల్లాడాయి. దీంతో రీ రిలీజ్ లో సింహాద్రి వ‌సూళ్ల ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ఏపీ, తెలంగాణలోనే ఈ సినిమా ఏకంగా రూ. 4.95 కోట్లు గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబట్టినట్లు చెబుతున్నారు. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 40 లక్షలు, ఓవర్సీస్ లో రూ. 67 లక్షలు వసూలు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రీ రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లోనూ సత్తా చాటుకున్న `సింహాద్రి`.. మొత్తంగా రూ. 6.02 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ఫ్యాన్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్ ను వ‌దిలారు.