ప్రముఖ నటి కిడ్నాప్.. అసలు విషయం తెలిసి షాక్ లో పోలీసులు..!!

టాలీవుడ్ లోకి మొదట కుమారి వర్సెస్ కుమారి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సునయన. తెలుగు ప్రేక్షకులకు తన అందచందాలతో అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత రెండు రోజుల నుంచి ఈ ముద్దుగుమ్మ కనిపించలేదంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటే సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఆమె మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ ఉందంటూ నెట్టింట పలు వార్తలు వైరల్ గా మారాయి.

Sunaina (Anusha) Photos [HD]: Latest Images, Pictures, Stills of Sunaina (Anusha) - FilmiBeat

దీంతో ఫ్యాన్స్ సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తమిళనాడు పోలీసుల వరకు చేరేసరికి ఆమెను వెతికే పనిలో పడ్డారు.. చివరిసారిగా సునయన ఎగ్మోర్, కోయంబేడు ప్రాంతాలలో సంచరించినట్లు సమాచారం.. దీంతో పోలీసులు కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా పోలీసులు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా వెతకడం ప్రారంభించారట. ఈ క్రమంలోనే సునయన ఇల్లు ఆమె నటించిన నిర్మాణ సంస్థలను కూడా ఆరా తీయడం జరిగింది. దీంతో అసలు విషయం బయటపడినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కిడ్నాప్ డ్రామా అంతా కేవలం తను నటించిన సినిమా ప్రమోషన్స్ లోని ఒక వీడియోలో భాగం అన్నట్లుగా తెలియజేసింది. దీంతో పోలీసులతో పాటు అభిమానులు ఒకసారిగా షాక్ గురయ్యారు. సదురు వీడియోని చూసిన అభిమానులు నిజమేనని కొందరు నమ్మి రేస్కు సునయన అనే హ్యాష్ ట్యాగ్ తో చాలా హంగామా చేశారు.. కానీ ఇదంతా మూవీ ప్రమోషన్ కోసం చేసిన స్టంట్ అని తెలిసి పలువురు సైతం కామెంట్లు చేస్తున్నారు ఇలాంటివి చేసేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకోవాలి కదా అంటూ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.

Share post:

Latest