టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్లలో సుమలత కూడా ఒకరు. ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటించి మెప్పించింది. ప్రస్తుతం రాజకీయాలలో చాలా చురుకుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కన్నడ రాజకీయాలలో చాలా చురుకుగా పోషిస్తుంది సుమలత. తాజాగా ఈమె కుమారుడు పెళ్లి త్వరలోనే జరగబోతున్నట్లు అందుకు సంబంధించి పలు పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
దివంగత నటుడు అంబరీష్.. హీరోయిన్ సుమలత కుమారుడు అభిషేక్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు .. అవివా బిడప్పా తో అభిషేక్ వివాహం జరిపించేందుకు పెద్దలు సైతం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ఇండస్ట్రీలోని నటీనటులు సైతం రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.వ్యాపారవేత్త ఆయన అవివా బిడప్పా గత కొంతకాలంగా అభిషేక్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు కూడా పెద్దల అంగీకారంతో పెళ్లిని చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులతో మాట్లాడి వీరు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చేసుకున్నట్లు తెలుస్తోంది ఇటీవల వీరి వివాహ నిశ్చితార్థం కూడా చాలా ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.
హీరోయిన్ సుమలత తెలుగులో కూడా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన తెలుగులో స్టార్ హీరోల్లో ఆయన చిరంజీవితో ఎక్కువ సినిమాలో నటించినట్లు సమాచారం. దీంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి సినీ ప్రముఖులు అభిషేక్-అవివా బిడప్పా వివాహానికి హాజరయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాండ్య పార్లమెంటు నియోజకవర్గం వర్గ ఎంపీగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.