ప‌వ‌న్‌-తేజ్ మూవీకి షాకింగ్ టైటిల్‌.. గోలెత్తిపోతున్న ఫ్యాన్స్‌!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ కాంబినేషన్ లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకనటుడు సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ సూప‌ర్ హిట్ `వినోదయ సీతమ్`కు రిమేక్ ఇది. తమిళంలో కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశారు.

అయితే తెలుగు రీమేక్ లో మాత్రం కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ చాలా వ‌ర‌కు కంప్లీట్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ కు `దేవుడే దిగి వచ్చిన` అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

కానీ, తాజాగా `బ్రో` అనే టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో తేజ్..పవన్ ని త‌ర‌చూ `బ్రో` అని పిలుస్తూంటాడ‌ట‌. దాంతో అదే టైటిల్ గా ఫిక్స్ చేశార‌ని అంటున్నారు. అయితే ఈ టైటిల్ తెలుసుకుని మెగా ఫ్యాన్స్ షాకవుతున్నారు. అదేం టైటిల్ అంటూ గోలెత్తిపోతున్నారు. `బ్రో` టైటిల్ ఏ మాత్రం బాగోలేద‌ని.. మార్చాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మ‌రి మేక‌ర్స్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. కాగా, జూలై 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే ఉండ‌బోతుంది.

Share post:

Latest