యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. అటువంటి వ్యక్తి తాజాగా ఓ డైరెక్టర్ పరువును దారుణంగా తీసేశాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు గీతా గోవిందం, సర్కారు వారి పాట చిత్రాల ద్వారా తన మార్క్ చూపించిన పరుశురామ్.
అసలు మ్యాటరేంటంటే నాగచైతన్య `థాంక్యూ` తర్వాత పరుశురామ్ తో సినిమా చేయాల్సి ఉంది. వీరి కాంబినేషన్ లో సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలుపెట్టుకున్నారు. కానీ, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దాంతో పరశురామ్ సిద్ధం చేసిన కథ నాగచైతన్యకు నచ్చలేదని ప్రచారం జరిగింది. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అంతకు మించి వీరి మధ్య ఏదో జరిగిందని చైతు తాజా వ్యాఖ్యలతో తేలిపోయింది.
`కస్టడీ` ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్యకు పరుశురామ్ తో సినిమాపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు చైతు `పరుశురామ్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్. అతను నా సమయాన్ని వృధా చేశాడు. ఈ టాపిక్ మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు` అని చైతు తేల్చి చెప్పేశాడు. దాంతో పరుశురామ్ తో గట్టిగానే చెడిందని.. అందుకే చైతు అలాంటి కామెంట్స్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఓ డైరెక్టర్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అంటూ చైతు వ్యాఖ్యానించడంతో పరుశురామ్ పరువు మొత్తం తీసేసినట్లు అయింది.