దేవర సినిమాలో కేజిఎఫ్ నటుడు..!!

ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న చిత్రం కావడం చేత ఇందులోని నటీనటులు సైతం చాలా జాగ్రత్తగా చూసి ఎంచుకుంటోంది చిత్ర బృందం. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన వల్లే బాలీవుడ్ లో కూడా దేవరా సినిమాకు మంచి పాపులారిటీ లభిస్తోందని సమాచారం.

తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో మరొక పాన్ ఇండియన్ స్టార్ హీరోని ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన కేజీఎఫ్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించిన తారక్ పొన్నప్ప పాన్ ఇండియా గుర్తింపు లభించింది. పోషించిన పాత్ర చిన్నదే అయినప్పటికీ కూడా గుర్తుండిపోయే పాత్ర అని చెప్పవచ్చు అందుకోసమే దేవర సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఇతని పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Tarak Ponnappa forays into Telugu television with Ravoyi Chandamma - Times  of India

ప్రస్తుతం ఎన్టీఆర్, తారక్ పోన్నప్ప కామినేషన్లో షూటింగ్ చిత్రీకరణ జరగబోతున్నట్లు తెలుస్తోంది.వచ్చే నెలలో మరో కీలకమైన షెడ్యూల్లో కూడా తారక్ పొన్నప్ప పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కాంబినేషన్లో సన్నివేశాలు కూడా తారక్ పొన్నప్ప ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసింది పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ సినిమాలో నటించబోతున్నారు.

Share post:

Latest