కేసీఆర్ బాటలో జగన్..పీఠాధిపతులతో యాగం.!

రాజకీయాల్లో స్వామీజీలు పాత్ర కూడా కీలకంగా మారిపోయిన విషయం తెలిసిందే. తమకు కావల్సిన నేతలు గెలవడం కోసం పూజలు కూడా చేస్తున్నారు. ఏపీలో స్వరూపనందస్వామి..జగన్‌కు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణలో చిన్నజీయర్ స్వామి..కే‌సి‌ఆర్‌కు సపోర్ట్ గా ఉంటున్నారు..అలాగే పూజలు, యాగాలు లాంటివి చేయిస్తున్నారు. ఇక కే‌సి‌ఆర్ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం చేయిస్తున్న విషయం తెలిసిందే.

యాగాలు చేయించడం ఎన్నికల్లో గెలవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కే‌సి‌ఆర్ బాటలో ఏపీ సి‌ఎం జగన్ సైతం వెళుతున్నారు. త్వరలోనే జగన్ ప్రభుత్వం కూడా రాజశ్యామల యాగం చేయిస్తున్నారు. అష్టోత్తర శతకుండ చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం నిర్వహించబోతోంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు యాగం జరగనుంది. ఈ యాగంలో పాల్గొనడానికి వివిధ పీఠాధిపతులు రాష్ట్రానికి తరలి రానున్నారు.

రాష్ట్రం సర్వతోముఖాభివృద్దిని సాధించాలనే లక్ష్యంతో ఈ యాగం చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక దేవాదాయ మంత్రిత్వ శాఖ ఈ యాగాన్ని పర్యవేక్షించనుంది. అంటే మొత్తం ప్రభుత్వం ఖర్చుతో ఈ యాగం నిర్వహించనున్నారు. విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సహా వివిధ పీఠాధిపతులకు ప్రభుత్వం ఆహ్వానించనుంది.

అయితే సంక్షేమం, అభివృద్ధిని సమంగా సాధిస్తూ, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలని, రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా సంక్షేమాభివృద్ధి ముందు సాగాలనే సంకల్పతో వైఎస్ జగన్ ఈ రాజశ్యామల యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఇక రాష్ట్రం కోసం యాగమని చెబుతున్నా..ఇది జగన్ మళ్ళీ సి‌ఎం అవ్వడం కోసమే చేయిస్తున్నారని టి‌డి‌పి నుంచి విమర్శలు వస్తున్నాయి.

Share post:

Latest