జగన్‌కు భారీ మద్ధతు..ఇంకా తిరుగులేనట్లేనా?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కూడా గెలుస్తామనే ధీమాలో జగన్ ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాల లబ్దిదారులుపైనే జగన్ ఆశలు పెట్టుకున్నారు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పథకాల పేరిట డబ్బులు ఇవ్వడం తప్ప మరొక పని జగన్ చేస్తున్నట్లే కనిపించడం లేదు. పెద్దగా అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టడం లేదు.

సరే ఏదేమైనా గాని ఇప్పుడు పథకాలు అందుకుంటున్న వారే తనని గెలిపిస్తారని అనుకుంటున్నారు..ఆ దిశగానే ముందుకెళుతున్నారు..అప్పులు చేసైన సరే వారికి డబ్బులు మాత్రం టైమ్‌కు వేసేస్తున్నారు. అందుకే పథకాల లబ్దిదారులపైనే జగన్ ఆశలు పెట్టుకున్నారు. అయితే పథకాలు అందుకుంటున్న వారు పూర్తిగా జగన్ వైపే ఉన్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో జగనన్నే మా భవిష్యత్ అంటూ వైసీపీ ఓ కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే.

దీని ద్వారా ఫోన్ నెంబర్ ఇచ్చి దానికి మిస్సడ్ కాల్ ఇచ్చి మద్ధతు తెలపాలని వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజల్ని కోరుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కోటి 40 లక్షల కుటుంబాల్లో సర్వే చేస్తే..దాదాపు కోటి 17 లక్షల కుటుంబాలు మిస్సడ్ కాల్స్ ఇచ్చాయట. అంటే అంతమంది జగన్‌కు మద్ధతు తెలిపారట. మరి ఇంత మద్ధతు నిజంగానే వస్తే జగన్ కు తిరుగులేదు..కానీ ఇది గాని ఫేక్ అంటే కష్టమే. లేదా మళ్ళీ పథకాలు ఎక్కడ పోతాయని భయంతో కొన్ని ఫ్యామిలీలు మిస్సడ్ కాల్స్ ఇచ్చిన ఇబ్బందే. చూడాలి మరి మిస్సడ్ కాల్స్ ఇచ్చిన వారంతా జగన్‌కు ఓటు వేస్తారో లేదో.