కేరళ స్టోరీ సినిమా కోసం అదాశర్మ ఎంత తీసుకుందో తెలిస్తే…

సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాని ఎన్ని కాంట్రవర్సీలు చుట్టూముట్టాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అదాశర్మ ప్రధాన పాత్రలో నటించింది. ది కేరళ స్టోరీతో అదా శర్మకి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా విడుదల అయిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే చాలా ప్రాంతాల్లో థియేటర్స్ నుంచి సినిమాని తొలగించారు. అంతేకాకుండా ఈ సినిమాని వెంటనే ఆపేయాలి అంటూ విమర్శలు వచ్చాయి. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ సినిమాను బ్యాన్ చేసారు. ఒకవిధంగా చెప్పాలంటే ది కేరళ సినిమాకి వివాదాలే బాగా కలిసొచ్చాయి.

ఈ వివాదాల్లో కొంతమంది సినిమాకు సపోర్ట్ చేస్తుండగా మరి కొంతమంది వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ కారణంగా సినిమాకి ఫ్రీగా పాపులారిటీ వస్తుందని చెప్పాలి. కొన్ని రాష్ట్రాలలో థియేటర్ల నుంచి సినిమాని తొలగిస్తే మరికొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగా కలెక్షన్లు కురిపిస్తుంది. ఇప్పటివరకు ‘ది కేరళ’ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. సినిమాకి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుండటంతో ఆ చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన అదాశర్మ గురించి మాట్లాడితే ఆమె అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ఈ బబ్లీ గర్ల్ దేశవ్యాప్తంగా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. దాంతో ప్రస్తుతం ఈ అమ్ముడు కోసం వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే ఈ సినిమాకి గాను అదా శర్మ తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రూ.40 కోట్లు బడ్జెట్ తో తీసిన ‘ది కేరళ’ మూవీ కోసం దాదాపు కోటి రూపాయలు పారితోషికం తీసుకుందట అదాశర్మ. కానీ ఆమెతో పాటుగా ప్రధాన పాత్రలో నటించిన యోగితా బిహాని, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీలు మాత్రం కేవలం రూ.30 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇక ఈ సినిమా ఎన్ని వివాదాలలో చిక్కుకున్నా సక్సెస్‌ఫుల్‌గా ముందు వెళ్తుంది.

Share post:

Latest