హీరోయిన్ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృంగార తారగా పేరుపొందిన ఈ అమ్మడు బాలీవుడ్లో స్టార్ యాక్టర్ గా కొనసాగుతోంది. అప్పుడప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇప్పుడు సన్నీలియోన్ నటన చూసి మెచ్చుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఆమె అడల్ట్ స్టార్ అని అవమానం కూడా ఎదుర్కొన్నది. ఆమె చేసే వృత్తి అలాంటిది అయినప్పటికీ కూడా ఎంతోమంది పిల్లలను ఆమె చదివిస్తూ తన మంచి మనసును చాటుకుంటుంది సన్నీలియోన్.
తాజాగా సన్నీలియోన్ కెన్నడి అనే చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తెలియజేసింది. తనను మార్చి వేసింది ఒక బిగ్ బాస్ షో మాత్రమే అంటూ తెలిపింది. నేను అడల్ట్ సార్ గా ఉన్నప్పుడు చాలా అవమానాలను ఎదుర్కొన్నాను హిందీలో వచ్చిన బిగ్ బాస్ తన జీవితాన్ని మార్చేసింది అంటూ తెలుపుతోంది సన్నిలియోన్. మొదటిసారి తనకు బిగ్ బాస్ మేకర్స్ కాల్ చేసినప్పుడు తన భర్తకు చెప్పిందట.. అతను వెళ్ళమని సలహా ఇచ్చారని తెలిపింది.
దీంతో సన్నీలియోన్ బుద్ధి ఉందా తనను చాలామంది ద్వేషిస్తున్నారు అంటూ తన భర్తతో చెప్పానని తెలిపింది తాను అప్పటికి అడల్ట్ స్టార్ను కాబట్టి ముందు అంత ధైర్యం చేయలేకపోయాను.. ఆ తర్వాత చాలామంది తనను చంపేస్తానంటూ బెదిరించారు అసలు ఇండియాకు రావద్దని బిగ్ బాస్ షోలో పాల్గొనవద్దని చెప్పారట.. అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొని బిగ్ బాస్ సీజన్-5 లో అడుగు పెట్టాను అక్కడ అందరితో కలిసి ఉండడం వంట చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది. అక్కడి నుంచి వచ్చాక అడల్ట్ సినిమాలకు దూరం అయ్యాను దీంతో తన జీవితాన్ని మార్చేసింది బిగ్ బాస్ అంటూ తెలిపింది సన్నీలియోన్.