సాయి శ్రీనివాస్‌ ఆ స్టేజ్ దాటిపోయాడంటూ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..

దర్శక దిగ్గజం రాజమౌళి, పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ ఛత్రపతి సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ప్రభాస్ పోషించిన శివాజీ అనే వ్యక్తి చిన్నతనంలో తన కుటుంబం నుండి విడిపోయి, ఆ తర్వాత శక్తివంతమైన, మాఫియా డాన్‌గా ఎదుగుతాడు. కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ యాక్షన్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా రీసెంట్‌గా 18ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది. అయితే దీనిని హిందీ భాషలో రీమేక్ చేయడం మొదలుపెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

పెన్ స్టూడియోస్ బ్యానర్‌లో జయంతిలాల్ గడా నిర్మాణంలో ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది మే 12న రిలీజ్ కావడానికి కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే మంగళవారం ఈ సినిమాను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో తెలుగు మీడియాకు ఒక షో వేసి చూపించారు. ఆ తర్వాత సినిమాకి దర్శకత్వం వహించిన వి.వి వినాయక్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో వివి వినాయక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒరిజినల్ సినిమాలో ఉన్న మంచి సన్నివేశాలను ఏమాత్రం పాడు చేయకుండా సినిమాను చాలా జాగ్రత్తగా రూపొందించామని పేర్కొన్నారు.క్షన్ సీన్స్, సాంగ్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయని కూడా తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అద్భుతంగా నటించాడని, ఈ మూవీతో హిందీలో పెద్ద స్టార్‌గా మారతాడని వి.వి వినాయక్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించడానికి ముందు తనలో చాలా సందేహాలు అనుమానాలు ఉన్నాయని దానిని చేయడానికి తాను సిద్ధంగా లేనని వినాయక్‌ చెబుతూ ఆశ్చర్యపరిచారు. చివరికి బెల్లంకొండ సురేష్ పట్టుబట్టడంతో కాదనలేకపోయానని చెప్పుకొచ్చారు. సాయి శ్రీనివాస్ మామూలు స్టేజ్ దాటిపోయాడని కూడా వ్యాఖ్యానించారు.

Share post:

Latest