`విరూపాక్ష‌` ద్వారా సుకుమార్ కు వ‌చ్చిందెంతో తెలుసా.. డైరెక్ట‌ర్ కంటే ఎక్కువ‌!?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ `విరూపాక్ష‌`. కార్తీక వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్ పై బీఎస్‌ఎన్‌ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మించారు.

ఏప్రిల్ 21న విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం.. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ క‌మ్ముస్తోంది. ఇక‌పోతే ఈ సినిమా నిర్మాణంలో డైరెక్ట‌ర్ సుకుమార్ పెట్టుబ‌డులు పెట్టార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అందులో నిజం లేద‌ట‌.

ఆయ‌న కేవ‌లం ఈ మూవీకి స్క్రీన్ ప్లే మాత్ర‌మే అందించారు. ఈ మూవీలోని ట్విస్టులకు అతని స్క్రీన్ ప్లేనే బలం చేకూర్చింది. అయితే ఎలాంటి పెట్టుబడి పెట్టకపోయినా.. స్క్రీన్ ప్లే అందించడం ద్వారానే సుకుమార్ ఏకంగా రూ.6 కోట్లు వెనకేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్ట‌ర్ కార్తీక వ‌ర్మ రెమ్యున‌రేష‌న్ కంటే ఇది చాలా ఎక్కువని కూడా అంటున్నారు. కాగా, సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్ తో `పుష్ప 2`ను తెర‌కెక్కిస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.