దగ్గుబాటి మూడోతరం హీరో రానా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా కొనసాగుతున్నాడు. ఇక 2020 ఆగస్టు 8న రానా- మిహిక బజాజ్ వివాహం చేసుకున్నాడు. ఈ జంట టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తన ప్రతి విషయాలను తన స్నేహితులతో సన్నిహితులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఇక ఇప్పుడు తాజాగా ఈమె ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఈమె బీచ్ లో నడుస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నేటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. మిహికా ప్రెగ్నెంట్ లా కనిపిస్తుంది, అందుకే అలా వదులైన డ్రస్సులో కనిపిస్తుంది అంటూ మరోసారి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
గతంలో మిహికా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ప్రెగ్నెన్సీ గాసిప్స్ గుప్పుమన్నాయి. అంతే కాకుండా ఓ పాపని ఎత్తుకున్న ఫోటోని మిహికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. కొందరైతే ఏకంగా కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆ పాప తమ బిడ్డ కాదని.. తన మేనకోడలు అంటూ క్లారిటీ ఇచ్చింది మిహికా..ఇక ఇప్పుడు మరోసారి ఆమె ప్రెగ్నెన్సీ పై ఇలాంటి వార్తలు రావడంతో ఈసారి ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
View this post on Instagram