మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో `రంగస్థలం` ఒకటి. ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2018లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ద్వారానే రామ్ చరణ్ లోని అద్భుతమైన నటుడు అందరికీ పరిచయం అయ్యాడు.
అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో రిలీజ్ కు సిద్ధమైంది. ఆ దేశంలోని చిబా పట్టణంలోని పరిమిత థియేటర్లలో ఈ చిత్రం ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 11 వరకు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే షో బుకింగ్‌లు కూడా తెరిచారు. ఇటీవల రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ జపాన్ లో ఎంతటి విజయం సాధించే తెలిసిందే.
అక్కడి బాక్సాఫీస్‌ను ఈ చిత్రం ఓ రేంజ్ లో షేక్ చేసింది. ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోట్ చేశారు. కానీ, ఇప్పుడు రంగస్థలంకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం లేదు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం రంగస్థలం జపాన్ లో రికార్డులు సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి అంచనాలు నిజం అవుతాయా..? లేక జనాలు రాక పరువు పోగొట్టుకుంటారా..? అన్నది చూడాలి.