ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా `పుష్ప 2` రాబోతోంది.
ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే నేడు రష్మిక బర్త్‌డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ కు బయటకు వదిలారు. అలాగే `వేర్ ఈజ్ పుష్ప..?` పేరుతో ఓ ప్రీ టీజర్‌ను బయటకు వదిలారు. ఈ వీడియోలో `తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప` అని న్యూస్ వినిపిస్తుంది.
ఆ తరువాత `అసలు పుష్ప ఎక్కడ?` అని ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. 20 సెకన్ల నిడివిగల ఈ ప్రీ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. అభిమానులకు పిచ్చెక్కించేసే విధంగా ఉంది. ఇక ఫుల్ టీజర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే కానుకగా ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకు రియలైజ్ చేయబోతున్నారు.