యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో హై బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తండ్రి, కొడుకులుగా రెండు పవర్ ఫుల్ రోల్స్ ను ఎన్టీఆర్ పోషిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కొరటాలను ఎన్టీఆర్ గుడ్డిగా నమ్ముతున్నాడంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.. గతంలో ఆంధ్రావాలా, శక్తి చిత్రాల్లో తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ నటించాడు. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో తండ్రి కొడుకులుగా నటిస్తే ఎన్టీఆర్ కు అట్టర్ ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఏర్పడింది. మరి ఈ సెంటిమెంట్ ఎన్టీఆర్ గుర్తిందా.. లేదా.. అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ 30 విషయంలోనూ ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఎక్కడ రిపీట్ అవుతుందో అని భయపడుతున్నారు.