బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ 2021లో హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా కత్రినా గర్భవతి అయ్యారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఆమె లేటెస్ట్ లుక్ కారణమైంది. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఖాన్ ముంబైలో గ్రాండ్ ఈద్ పార్టీ ఇచ్చరు. ఈ పార్టీకి కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఆమె అనార్కలి డిజైనర్ వేర్లో ఎంతో అందంగా ఉన్నారు.
కత్రినా కైఫ్ కొంచెం ఒళ్ళు చేశారు. ఇక దాంతో ఆమె గర్భవతి అనే విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దాంతో కత్రినా తల్లి కాబోతుందంటూ వాగర్థాలు వినిపిస్తున్నాయి. కాబట్టి కత్రినా కైఫ్ తన గర్భాన్ని దాచి పెడుతుందని కొందరు అంటున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు అని మరికొంతమంది అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇక కత్రినా కైఫ్ తెలుగులో వెంకటేష్, బాలయ్య వంటి స్టార్ హీరిల సినిమాలో కూడా నటించారు. కత్రినా కైఫ్ రెండవ చిత్రం మల్లీశ్వరి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే బాలయ్యకు జంటగా అల్లరి పిడుగు సినిమాలో నటించారు. అల్లరి పిడుగు నిరాశపరిచింది. బాలీవుడ్ లో బిజీ అయిన కత్రిన మరలా టాలీవుడ్ వైపు చూడాలేదు.
దశాబ్దం పాటు కత్రిన బాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. సల్మాన్ ఖాన్, రన్బీర్ కపూర్ వంటి హీరోలతో ఎఫైర్స్ నడిపారనే ప్రచారం కూడా జరిగింది. ఇక ప్రస్తుతం కత్రిన మెర్రి క్రిస్మస్, టైగర్ 3 వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అటు ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కత్రిన ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.