మెగా హీరో విషయంలో అతి చేస్తున్న మీడియా.. కొంప ముంచేందుకేనా?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ మెగా హీరో హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిజానికి ప్రమాదం జరిగినప్పుడు అబ్దుల్ పర్హాన్ అనే వ్యక్తి చాలా వేగంగా స్పందించి ఆసుపత్రికి చేర్చే విషయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకు గాను మెగా ఫ్యామిలీ సదరు యువకుడికి భారీ ఎత్తున డబ్బులు అందించిందని వార్తలు వచ్చాయి. దాంతో ఎంత ఇచ్చారనే విషయం తెలుసుకునేందుకు అబ్దుల్‌కి మీడియా వారితో పాటు చాలామంది ఫోన్లు చేసి విసిగించారు.

ఈ ఫోన్లను అటెండ్ చేయలేక అతడు బాగా సతమతమయ్యాడు. చివరికి వర్క్ లైఫ్ కూడా ప్రభావితమయ్యింది. దానివల్ల అతని జాబ్ కూడా పోయింది. అయితే ఇటీవల అతడు ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. తనకి ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, డబ్బులను ఎవరి నుంచి తాను ఆశించడం లేదని అతడు స్పష్టం చేశాడు. కానీ మీడియా అతి వల్ల పాపం అతడు ఉద్యోగం కోల్పోయాడు. న్యూస్ మీడియా, ముఖ్యంగా తెలుగు మీడియా టిఆర్పి కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కూడా సాహసిస్తోంది. మీడియా అతి చేయడం వల్ల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అబ్దుల్ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

మరోవైపు అబ్దుల్ వార్తలు సాయి ధరమ్‌ తేజ్ వరకు వెళ్లాయి. ఈ విషయంపై అతను కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఎలాంటి నగదు సహాయం చేయలేదని స్పష్టం చేశారు. అయితే తన మేనేజర్ శరన్ ఫర్హాన్‌తో టచ్ లో ఉన్నారని, ఏ సహాయం కావాలన్నా అతనికి చేయడానికి తమ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Share post:

Latest