బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన శ్రీదేవి ఆ తర్వాత అతిలోకసుందరిగా భారతదేశంలోనే అగ్ర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి ముందుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునీ ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీలో కూడా తన అందం అభినయంతో అగ్ర నటిగా ఎదిగింది. అలాంటి శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ ఎందరో అగ్ర హీరోలతో ప్రేమాయణాలు నడిపింది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో మిధున్ చక్రవర్తిని పెళ్లి చేసుకునీ తర్వాత కొద్ది రోజులకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో ప్రేమలో పడి వార్తల్లో నిలిచింది. అయితే శ్రీదేవి బోనీ కపూర్‌ని ముందు నుంచి అన్నయ్య అనే పిలిచేదట. కానీ బోనీ కపూర్ మాత్రం శ్రీదేవిని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమెకు సంబంధించిన అన్ని విషయాలలో అండగా ఉంటూ తన మాయలో పడేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడట. అయితే బోనీ కపూర్ కి అప్పటికే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ విషయం శ్రీదేవికి తెలియడంతో బోనీ కపూర్ ని పెళ్లి చేసుకోవడానికి కాస్త వెనక అడుగు వేసిందట.. కానీ బోనీ కపూర్ మాత్రం నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టడంతో శ్రీదేవి కూడా పూర్తిగా బోనీ కపూర్ మాయలో పడిపోయింది.
అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోక పోయినప్పటికీ భార్యాభర్తలుగా ఫంక్షన్లకు, ఈవెంట్లకు అన్నిటికీ కలిసి తిరిగే వారట. దాంతో ఒక రోజు బోనీ కపూర్ తల్లి ఓ సినిమా ఫంక్షన్లో అందరూ చూస్తుండగానే శ్రీదేవిని చెప్పుతో చంప మీద కొట్టిందట. అక్కడ ఉన్నఅందరి ముందే బోనీ కపూర్ తల్లి శ్రీదేవిని చెప్పుతో కొట్టడానికి ప్రధాన కారణం.. తన కొడుకు శ్రీదేవిని పెళ్లి చేసుకుంటే మొదటి భార్య ఎక్కడ విడాకులు ఇవ్వమని అంటుందనే భయంతో తన కోపాన్ని శ్రీదేవి పై చూపించింది బోనీ కపూర్ తల్లి.
అయితే బోని కపూర్ మాత్రం శ్రీదేవితో సీక్రెట్ గా తన ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూ పెళ్లికి ముందే శ్రీదేవినీ ప్రెగ్నెంట్ చేశాడట. అలాగే శ్రీదేవి- బోనీకపూర్ ఇద్దరు కలిసి చేసిన మోసాన్ని తట్టుకోలేక బోనీ కపూర్ మొదటి భార్య కూడా బోనీ కపూర్ కి విడాకులు ఇచ్చేసింది. దాంతో శ్రీదేవి బోనీకపూర్ ల ప్రేమ పెళ్లికి ఎండ్ కార్డ్ పడినట్లయింది.