వర్జినిటీ గురించి అడిగిన నెటిజన్.. ‘అదే ప్రశ్న నీ అమ్మని అడుగు’ అంటూ ఇలియానా రిప్లై..

నాజుకైన నడుముతో అందరినీ తన అభిమానులుగా చేసుకున్న నటి ఇలియానా. ఈ ముద్దుగుమ్మకు 36 ఏళ్ల వయసు వచ్చింది కానీ పెళ్లి కాలేదు. అయినా గర్భం దాల్చి అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి కాకపోయినా తాను తల్లి అయ్యానంటూ ఆమె సోషల్ మీడియాలో ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు తన బిడ్డ తండ్రి పేరు చెప్పనందుకు కొందరు ఈ నటిని ట్రోల్ చేశారు. అయితే, ఇలియానా అభిమానులు ఆమెకు రక్షణగా నిలిచారు.

ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉంటుంది. కానీ ఆమెను ట్రోలర్స్‌ ఏదో ఒక విధంగా రెచ్చగొడుతూనే ఉంటారు. ఒకసారి 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో ఒక నెటిజన్ ఇలియానాను ఆమె కన్యత్వం గురించి అడిగాడు. మీరు ఎప్పుడు వర్జినిటీ కోల్పోయారంటూ అతడు అసభ్యకర ప్రశ్న వేశాడు.

దానికి ఈ తార స్పందిస్తూ, “వావ్. ఇతరుల విషయాలు తెలుసుకోవాలని అంత కుతూహలం ఎందుకు? ఇదే ప్రశ్న అడిగితే మీ అమ్మ ఏమి చెబుతుంది?” అంటూ ట్రోలర్‌ నోరు మూయించింది. ముద్దుగుమ్మ భర్త ఎవరు అని ఇప్పుడు ట్రోలర్స్ ఆమెను అవమానపరచడానికి ట్రై చేస్తుండగా అభిమానులు ఇలాంటి రిప్లైలను గుర్తు చేసుకుంటున్నారు.

ఏప్రిల్ 18న, ఇలియానా తన ప్రెగ్నెన్సీ వార్తలను తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. ఇకపోతే ఈ అందాల తార ఇటీవల ఒక మ్యూజిక్ వీడియో సాంగ్ లో బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. త్వరలోనే ఒక సినిమాలో ఇలియానా కనిపించనుంది. ఈ అందాల తార అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో కాస్త బొద్దుగా తయారైంది. ఇప్పుడు గర్భం దాల్చడంతో ఆమె మళ్లీ ఎప్పుడు ఫుల్ టైమ్‌ సినిమాలలో కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాతే ఈ ముద్దుగుమ్మ కెరీర్ దాదాపు ముగిసింది.