విజయవాడలో వైసీపీకి ఎదురుదెబ్బ..మూడు డౌటే!

ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి మాత్రం ఊహించని షాకులు తగిలేలా ఉన్నాయి..గత ఎన్నికల్లో అంటే వైసీపీ వేవ్ ఉండటం వల్ల ఎక్కువ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది గాని..ఈ సారి మ్యాజిక్ ఫిగర్ సీట్లు తెచ్చుకుని అధికారం దక్కించుకోవడమే కష్టమనే పరిస్తితి. ఇప్పటికే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది. ఈ క్రమంలో చాలా సీట్లలో వైసీపీ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి.

ఇదే క్రమంలో విజయవాడ నగరంలో ఉన్న మూడు సీట్లలో ఈ సారి వైసీపీకి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఈ సారి మూడు సీట్లలో టి‌డి‌పి హవా నడిచేలా ఉంది. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు, ఈస్ట్ అసెంబ్లీ సీటు టి‌డి‌పి గెలుచుకుంది. అంటే వైసీపీ వేవ్ ఉన్నా సరే టి‌డి‌పి కొంతమేర సత్తా చాటింది. ఇక విజయవాడ సెంట్రల్ సీటు కేవలం 25 ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. అటు విజయవాడ వెస్ట్ సీటు 7 వేల ఓట్ల తేడాతో గెలిచింది.

ఇలా రెండు సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఈ సారి ఆ రెండు సీట్లు కూడా వైసీపీ గెలుచుకునేలా లేదు. ఇప్పటికే వచ్చిన సర్వేలో విజయవాడ ఈస్ట్, సెంట్రల్ సీట్లు టి‌డి‌పి గెలుచుకుంటుందని తేలింది. ఇక విజయవాడ వెస్ట్ లో టఫ్ ఫైట్ ఉందని తేలింది. కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. ఆ టఫ్ ఫైట్ ఉండటానికి కారణం జనసేన ఓట్లు చీల్చడమే.

అలా కాకుండా టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే దెబ్బకు సీన్ రివర్స్ అవుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే వెస్ట్ సీటుని కూడా వైసీపీ గెలవలేదు. ఇక పొత్తులో భాగంగా వెస్ట్ సీటు జనసేనకే దక్కేలా ఉంది. మొత్తానికి విజయవాడ లో వైసీపీకి షాక్ తప్పదని చెప్పవచ్చు.