రాజ‌మౌళి-మ‌హేష్‌ మూవీ బ‌డ్జెట్ రివీల్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మెంట‌లెక్కిపోతారు!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ మూవీ అనంతరం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నాడు. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రానికి రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ ర‌చ‌యిత విజేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మ‌రి కొద్ది నెల‌ల్లో సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది.

అయితే తాజాగా ఈ మూవీ బ‌డ్జెట్ రివీల్ అయింది. ఎన్నో కోట్లో తెలిస్తే మెండ‌లెక్కిపోతారు. ఎందుకంటే, రాజ‌మౌళి-మ‌హేష్ బాబు మూవీని దాదాపు ఎనిమిది వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో నిర్మించ‌బోతున్నార‌ట‌. నిర్మాణంలో రాజ‌మౌళి భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అలాగే ఈ సినిమా కోసం హాలీవుడ్ న‌టుల‌ను కూడా జ‌క్క‌న్న తీసుకుంటున్నార‌ట‌. నిజంగా మ‌హేష్ బాబు, రాజ‌మౌళి మూవీకి ఎనిమిది వంద‌ల కోట్ల బ‌డ్జెట్ ను కేటాయిస్తే టాలీవుడ్‌లో బిగ్ బ‌డ్జెట్ మూవీ ఇదే అవుతుంది.