టీడీపీ-జనసేన కాంబినేషన్..గుంటూరులో టార్గెట్ 15!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సారి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. అమరావతి ప్రభావం, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం లాంటి అంశాలు టి‌డి‌పికి బాగా కలిసొస్తున్నాయి. గత ఎన్నికల్లో అంటే వైసీపీ వేవ్ లో గుంటూరులో  టి‌డి‌పి బాగా దెబ్బతింది. జిల్లాలో 17 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టి‌డి‌పి గెలుచుకుంది. 15 సీట్లు వైసీపీ గెలుచుకుంది.

ఇక టి‌డి‌పి నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టి‌డి‌పికి ఒక ఎమ్మెల్యే మిగిలారు. అయితే అలాంటి పరిస్తితి నుంచి టి‌డి‌పి ఇపుడు జిల్లాలో ఆధిక్యంలోకి వచ్చింది. కాకపోతే జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలంటే జనసేన మద్ధతు తప్పనిసరి. ఇటీవల వచ్చిన సర్వేలో టి‌డి‌పి 8 సీట్లు, వైసీపీ 6 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేలింది. అలాగే 3 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది.

అయితే టి‌డి‌పి గెలిచే సీట్లు వచ్చి తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, చిలకలూరిపేట, బాపట్ల, వినుకొండ, రేపల్లె, వేమూరు.. వైసీపీ గెలుపు అవకాశం ఉన్న సీట్లు ప్రత్తిపాడు, తెనాలి, పెదకూరపాడు, మాచర్ల, నరసారావుపేట, గుంటూరు ఈస్ట్ స్థానాలు..టఫ్ ఫైట్ ఉన్న సీట్లు గురజాల, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్ సీట్లు. అయితే టి‌డి‌పి జనసేన పొత్తు ఉంటే వైసీపీ గెలుపు అవకాశం ఉన్న సీట్లలో సీన్ రివర్స్ అవుతుంది. ప్రత్తిపాడు, పెదకూరపాడు, గుంటూరు ఈస్ట్, తెనాలి సీట్లు వైసీపీకి దక్కడం కష్టం.

ఇక టఫ్ ఫైట్ ఉన్న గురజాల, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి సీట్లు సైతం టి‌డి‌పి జనసేన పొత్తులో గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే పొత్తు ఉంటే జిల్లాలో 15 సీట్లు టి‌డి‌పి-జనసేన గెలుచుకోవడం ఖాయమని చెప్పవచ్చు.

Share post:

Latest