ఆ యాంకర్ పై వచ్చిన రూమర్స్ తో క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఒకరు. మొదట ఎన్నో సినిమాలకు కథలు రాస్తూ ఉండే రాజ్ తరుణ్ డైరెక్టర్ రామ్మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆవికా గోర్ నటించింది. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుత కాలంలో ఒక్క సక్సెస్ కూడా లేకుండా సతమతమవుతున్నాడు రాజ్ తరుణ్. అయితే గతంలో రాజ్ తరుణ్ పైన యాంకర్ లాస్య పైన పలు రూమర్లు వెలుపడ్డాయి.వాటి గురించి తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

గతంలో యాంకర్ లాస్యతో రాజు తరుణ్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అంటూ ఇండస్ట్రీలో వార్తలు ఎక్కువగా వినిపించాయి అయితే ఈ వార్తల పైన రాజు తరుణ్ స్పందిస్తూ తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేవలం తన ఫోకస్ మొత్తం కెరియర్ పైనే ఉందని.. తెలియజేయడం జరిగింది అంతేకాకుండా రాజ్ తరుణ్ లాస్య కేవలం ఒక ఈవెంట్లో కలిసి కనిపించారు.ఆ తర్వాత వీరిద్దరూ మధ్య ఎలాంటి మాటలు కూడా లేవట.

కానీ మీడియా మాత్రం వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రాసేసారని తెలియజేశారు హీరో రాజ్ తరుణ్.ఈ వార్తల సమయంలోనే లాస్య వివాహం చేసుకోబోతోందని వార్తలు కూడా వినిపించాయి. అది కూడా ఒక హీరోని అంటూ వైరల్ గా మారడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. కానీ ఇదంతా కేవలం ఒక గాసిప్ అన్నట్టుగా చేరిపోయింది. ప్రస్తుతం లాస్య వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. లాస్యకు ఇద్దరు కొడుకులు జన్మించినట్లు తెలుస్తోంది.

Share post:

Latest