నేనే తోపు అనుకున్న దిల్ రాజు కి.. దూల తీర్చేసిన సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు. స్టార్ గా ఉన్న హీరో జీరో అవ్వడం జీరోగా ఉన్న స్టార్ హీరోగా మారడం రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటాయి . కాగా కేవలం హీరో హీరోయిన్ల విషయంలోనే కాదు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ విషయంలో కూడా ఇలాంటివే జరుగుతాయని ప్రూవ్ చేశాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్ రాజు.

మనకు తెలిసిందే కష్టానికి మరో మారుపేరుగా చెప్పుకునే దిల్ రాజు… ఇండస్ట్రీలోకి ఎలాంటి పొజిషన్లో అడుగుపెట్టారు అనేది. తన సొంత టాలెంట్ తో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిపోయిన దిల్ రాజు ..ప్రెసెంట్ పలు పాన్ ఇండియా భారీ ప్రాజెక్టులో సినిమాలను నిర్మిస్తున్నారు. ఏదైనా సినిమా కథ వింటే ఆ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది ..ఎక్కడ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ చెప్పే సత్తా ఉన్న ప్రొడ్యూసర్ అంటూ చాలామంది నటులు చెప్పుకొస్తారు.

కానీ దిల్ రాజు భారీ అంచనాలు పెట్టుకొని ఊహించి నిర్మించిన సినిమా బొక్క బోర్లా పడి ఆయనకు కోట్ల లాస్ తీసుకొచ్చింది . ఆ సినిమా మరేదో కాదు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద డిజాస్టర్ గా నిలిచిన శ్రీనివాస కళ్యాణం. నితిన్ కెరియర్ లోనే పరమ చెత్త సినిమాగా నిలిచింది. రాశిఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా హ్యూజ్ లాస్ లు తెచ్చిపెట్టింది.

మరీ ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వడం ఎమోషన్స్ ను బ్యాలన్స్ చేయలేకపోవడంతో.. ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . అయితే సినిమా కోసం మాత్రం దిల్ కోట్లు ఖర్చు చేశాడని తెలుస్తుంది . ఆ లొకేషన్స్ కోసం నాచురల్ లుక్స్ కోసం చాలా కష్టపడ్డారట . కానీ ఫ్లాప్ అయినా సరే దిల్ రాజుకు ఆ సినిమా ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఎప్పటికీ మరువలేను అంటూ స్వయంగా చెప్పుకొచ్చారు..!!

Share post:

Latest