చిత్ర పరిశ్రమలో ఉండే వారి బంధాలు గడ్డి పరకాల మారిపోయాయి. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో..? ఎప్పుడు పుటుక్కున ఎగిరిపోతాయో అర్థం కాని పరిస్థితి. వారు ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటారో..? ఎప్పుడు విడిగా ఉంటారో కూడా అర్థం కాదు. చిత్ర పరిశ్రమంలో ఉన్న కొందరు స్టార్ సెలబ్రిటీస్ అయితే వారు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడుకి పైగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఈ సినిమా రంగంలో ప్రేక్షకులు చేత స్టార్ హీరోలుగా అనిపించుకుంటూ మూడుకి పైగా పెళ్లిళ్లు చేసుకున్న సార్ట్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ :
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన గురించి ఎప్పుడూ మూడు పెళ్లిళ్లే కాంట్రవర్సీ అవుతాయి. ముందుగా పవన్‌కు వైజాగ్‌కు చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి చిరంజీవి స్వయంగా దగ్గరుండి జరిపించారు. పవన్ సినిమాల్లోకి రావడానికి ముందు ఈ పెళ్లి జరిగింది. సినిమాల్లోకి వచ్చాక తనతో బద్రి, జానీ సినిమాలు హీరోయిన్గా చేసిన రేణుదేశాయ్‌తో పవన్ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక రేణుకు విడాకులు ఇచ్చేసి తీన్మార్ హీరోయిన్ అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు.
వీకే నరేష్ :
సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను నరేష్ చిన్న వయస్సులోనే పెళ్లాడాడు. వీరి కొడుకే హీరో నవీన్ విజయ్‌కృష్ణ. ఆమెతో మనస్పర్థలతో విడాకులు ఇచ్చేసి ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి ముచ్చటగా మూడోసారి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్య రఘపతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు పుట్టాక ఇప్పుడు ఆమెతో దూరంగా ఉంటూ సీనియర్ నటిమణి పవిత్రా లోకేష్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు.
కమల్‌హాసన్ :
లోకనాయకుడు కమల్‌హాసన్ ముందుగా వాణీ గణపతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు ఇచ్చేసి అప్పట్లో బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్గా ఉన్న సారికతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చాలా యేళ్ల పాటు సారికతో కలిసే ఉన్నా కమల్ ఆమెకు విడాకులు ఇచ్చేసి సీనియర్ నటి గౌతమితో కొన్ని సంవత్సరాల పాటు డెటింగ్చేశాడు. ఇది అఫీషియల్‌గానే జరిగింది. తర్వాత గౌతమి కూడా కమల్‌కు దూరమైంది. ఇప్పుడు ఉత్తమవిలన్, విశ్వరూపం హీరోయిన్ పూజాకపూర్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తాలు వస్తున్నాయి.
రాధిక :
రాధిక కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే మళయాళ దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను 1985లో వివాహం చేసుకుంది. తర్వాత యేడాదికే విడాకులు ఇచ్చేసి ఓ బ్రిటీష్ వ్యక్తిని పెళ్లాడి లండన్‌లో స్థిరపడింది. వీరికి ఓ కుమార్తె పుట్టాక రాధికను అతడు హింసించడంతో విడాకులు ఇచ్చేసి ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత సీనియర్ నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవిస్తోంది. శరత్‌కుమార్‌కు కూడా ఇది రెండోపెళ్లి.
జెమినీ గణేషన్ :
తమిళంలో ఎవర్గ్రీన్ హీరో జెమినీ గణేషన్ సైతం తొలి భార్యకు దూరమయ్యాక తెలుగు హీరోయిన్ పుష్పవల్లితో ఎఫైర్ పెట్టుకుని సహజీవనం చేశాడు. వీరి సంతానమే బాలీవుడ్ అందాల నటి రేఖ. ఆ తర్వాత సావిత్రిని మూడో వివాహం చేసుకున్నాడు.
వీరితో పాటు ఎందరో బాలీవుడ్ స్టార్ హీరోలైన కిషోర్ కుమార్ – వినోద్ మెహ్రా – సిద్ధార్థ్‌రాయ్ కపూర్ – సంజయ్‌దత్ – కరణ్‌సింగ్ గ్రోవర్ వంటి తదితరులు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.