నానికి ఎదురైన షాకింగ్ ఘటన.. దెబ్బకు రెండు నెలలు నిద్ర దూరం!!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. మార్చి 30న దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ‘దసరా’ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నాని మాట్లాడుతూ ‘దసరా సినిమాలోని ఒక సన్నివేశంలో నటించి దాదాపు రెండు నెలలు అయింది. కానీ ఇప్పటికీ ఆ సంఘటన నుంచి బయటకు రాలేకపోతున్నా. దానివల్ల సరిగా నిద్ర కూడా పట్టట్లేదంటూ’ షాకింగ్ కామెంట్స్ చేశారు.

దసరా సినిమాలో ఒక సీన్‌లో భాగంగా డంపర్ ట్రక్ బొగ్గును తీసుకెళ్లి డప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ సీన్ లో తాను డంపర్ ట్రక్ నుంచి కింద పడగా తనపై బొగ్గు పడే సన్నివేశం చేయాల్సి వచ్చిందట. అయితే ఆ సన్నివేశం కోసం సిలికాన్ బొగ్గు తయారు చేశారట. ఆ బొగ్గు మొత్తం పూర్తిగా డస్ట్ పట్టి ఉంటుంది. ఈ సన్నివేశం చేసే సమయంలో తాను డంపర్ ట్రక్ నుంచి కింద పడిపోగా బొగ్గు మొత్తం నాని పై పడుతుంది.

అందులో నుంచి ఆయన్ని పైకి తీసుకురావాలి అంటే కాస్త సమయం పడుతుంది. ఆ సమయంలో తాను శ్వాస తీసుకోకుండా ఉన్నారట. ఒకవేళ శ్వాస తీసుకుంటే ఆ డస్ట్ మొత్తం లోపలికి పోతుంది. కాబట్టి ఆ సమయంలో కాస్త ఇబ్బంది పడ్డారట నేచరల్ స్టార్. ఆ సన్నివేశం పూర్తయిన రెండు నెలల వరకు తనకు ఆ భయం పోలేదట, కనీసం రాత్రిపూట నిద్ర కూడా సరిగా పట్టేది కాదంటూ నాని చెప్పారు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Share post:

Latest