అది అసలు మ్యాటర్..రాజమౌళి పేరు ముందు S S అని పెట్టడానికి కారణం అదే.. “ఎస్” వెనుక ఇంత సీక్రెట్ ఉందా ..?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ బాగా తెలిసిందే. సీరియల్ ని డైరెక్ట్ చేస్తూ చిన్న డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రపంచ దేశాలని ముప్పు తిప్పులు పెడుతున్నాడు . తనదైన స్టైల్ లో డైరెక్షన్లో ముందుకెళుతూ ప్రపంచ దేశాలలో ఉండే దర్శక దిగ్గుజాల ను గజగజ వణికిస్తున్నాడు రాజమౌళి. మన తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు చూపిస్తున్నాడు రాజమౌళి అనడంలో సందేహం లేదు.

రీసెంట్గా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ కి ఒక్క అడుగు దూరంలో ఉంది . మరికొద్ది గంటల్లోనే ఆస్కార్ ను ముద్దాబోతున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది . రాజమౌళి అనగానే ఆయన పేరుకు ముందు ఎస్ ఎస్ అనే అక్షరాలు ఉంటాయి . అసలు ఎస్ ఎస్ అనేది ఏంటి అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు . ఈ క్రమంలోనే ఎస్ ఎస్ రాజమౌళి అని ఎందుకు పెట్టుకున్నాడు జక్కన్న అనే విషయం వైరల్ అవుతుంది .


రాజమౌళి పేరెంట్స్ ఇద్దరు శివ భక్తులట. అలా వీరిద్దరూ శ్రీశైలం కి వెళ్ళొచ్చాక రాజమౌళి పుట్టడంతో దేవుని మీద ఉన్న భక్తి వల్ల రాజమౌళి పేరు ముందు శ్రీశైల శ్రీ రాజమౌళి అని పెట్టారట..అందుకే రాజమౌళి పేరు ముందు ఎస్ ఎస్ అని అనే అక్షరాలు ఉంటాయి.దేవుడి పేరు కలిసి వచ్చేలా పెట్టిన రాజమౌళి కి అప్పటి నుంచి లక్ పాకెట్లో పెట్టినట్లు అయింది . తీసిన ప్రతి సినిమా హిట్ అవుతూ ఉండడంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మారిపోయాడు.

 

Share post:

Latest