ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే ఆ సినిమా ఆస్కార్ గెలిచి ఉండాలి..లాస్ట్ మినిట్ లో అంతా నాశనం చేసేసారా..?

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా..అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమాకి ఆస్కార్ అవార్డు వరించింది . కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఫిలిం ఎప్పుడెప్పుడు ఆస్కార్ అవార్డ్ అందుకుంటుందా..? అంటూ కోట్లాదిమంది జనాలు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేశారు. ఫైనల్లీ ఆ మూమెంట్ రావడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే ఓ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవాల్సి ఉంది. అదే మల్టీ టాలెంటెడ్ హీరో కమల్ హాసన్ నటించిన దశావతారం సినిమా. 60 ఏళ్లు దాటిన ఇప్పటికీ కెరీర్ రన్నింగ్ లో ఉంది . కమల్ హాసన్ ఎన్నో అవార్డులు అందుకున్నాడు. అయినప్పటికీ ఆయన తీరని కల ఏది అంటే ఆస్కార్ . ఇప్పటికి తన సినిమాలు 100 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధిస్తూనే ఉన్నాయి. ఏడు ఎనిమిది సార్లు కచ్చితంగా ఆస్కార్ లభిస్తుందని ప్రయత్నాలు చేశాడు. కానీ ఏ ఒక్కటి ఆస్కార్ గడప తప్పకపోవడం విశేషం .

కమలహాసన్ నటించిన దశావతారం అప్పట్లో ఆస్కార్ అవార్డు అందుకుంటుంది అంటూ అందరూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భాషా భేదం, జాతి భేదం, వృత్తి భేదం, లింగ బేధం ,దేశ భేదం అనే విషయాలు లేకుండా ఎంతో రియాల్టీని కనిపించే విధంగా పది పాత్రలను సెలెక్ట్ చేసుకుని అన్ని పాత్రలకు కూడా సరైన న్యాయం చేశాడు. కమలహాసన్ తనదైన స్టైల్ లో అద్భుతంగా నటించాడు. కమలహాసన్ ఈ సినిమాకి కచ్చితంగా ఆస్కార్ అవార్డు అందుకుంటుంది అంటూ ధీమావ్యక్తం చేశారు . అయితే కనీసం ఆస్కార్ కి నామినేట్ కూడా కాలేదు ఈ సినిమా . ఈ క్రమంలోనే కమలహాసన్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఎంతోమంది ఈ సినిమాకి ఆస్కార వస్తుందని అనుకున్నారని కానీ అలా జరగలేదు.. చాలా బాధగా ఉంది అంటూ స్వయాన కమలహాసన్ చెప్పుకోరావడం అప్పట్లో సంచలనంగా మారింది . తన జీవితంలో మొత్తం 19 ఫిలింఫేర్ అవార్డులు అందుకుని..ఐదు జాతీయ అవార్డులు అందుకున్న కమలహాసన్ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆస్కార్ రాకపోవడం గమనార్హం..!!

Share post:

Latest