హీరో ని జుట్టుపట్టుకుని లాగి పెట్టి మరి కొట్టిన హీరోయిన్.. అసలు ఏమైందంటే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ గ్లామరస్ ప్రపంచంలో ఆడది అంటే కేవలం గ్లామరస్ పరంగానే ట్రీట్ చేస్తూ ఉంటారు . అది టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా హీరోయిన్ అంటే హీరోయిన్ అంతే ..ఇలాంటి క్రమంలోనే కొందరు స్టార్ నటులు హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉంటారు . అయితే సైలెంట్ హీరోయిన్స్ గుట్టు చప్పుడు కాకుండా ఏడుస్తూ ఆ వ్యవహారాన్ని భరిస్తే.. మరి కొంతమంది డేఅరింగ్ గర్ల్స్.. ఆ విషయాన్ని బయటపెట్టి చీల్చి చెండాడుతారు.

రీసెంట్ గా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నూర ఫతేహి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన ఇన్ సిడేంట్ ని బయటపెట్టింది . తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది . ఈ క్రమంలోనే తొలి సినిమా “రోర్ : టైగర్స్ ఆఫ్ ది సుండర్ బన్స్” అనే సినిమా షూటింగ్ లో కో స్టార్ తో పెద్ద గొడవ జరిగిందని ..ఆమె చెప్పి షాక్ ఇచ్చింది .

ఆమె మాట్లాడుతూ..”నా ఫస్ట్ సినిమాలోనే ఇంత పెద్ద గొడవ జరుగుతుంది అని ఊహించలేకపోయాను . నా మొదటి చిత్రంలోని కొన్ని సన్నివేశాలు బాంగ్లాదేశ్లో చిత్రీకరించారు . అదే టైంలో సీన్ చేస్తున్నప్పుడు సదరు కో స్టార్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే నాకు మండిపోయి.. అతగాడిని అందరి ముందు జుట్టు పట్టుకొని కొట్టేసాను. దీంతో డైరెక్టర్ మధ్యలో కి దూరి నా కోపాన్ని కంట్రోల్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశాడు” అంటూ గుర్తు చేసుకుంది. దీంతో ఆమె మాటలు వైరల్ గా మారాయి..!!

Share post:

Latest