“నయనతార క్యారెక్టర్ అదే”..కడుపుమంటతో అసలు నిజాని బయటపెట్టిన NTR హీరోయిన్..!!

సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ..ప్రెసెంట్ ఒక్కో సినిమాకి పది కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ పొజిషన్లో ఉంది . కాగా రీసెంట్ గానే ప్రేమించిన డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకున్న నయన్.. నాలుగు నెలలకే తల్లిగా మారింది . ఈ క్రమంలోని ఆమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు ఈ మధ్యకాలంలో నయనతార పేరు సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. మొదట పెళ్లి.. ఆ తర్వాత గుడిలో చెప్పులు వేసుకోవడం.. ఆ తర్వాత సరోగసి ద్వారా పిల్లలు.. ఆ తర్వాత నెట్ఫిక్స్ తో అగ్రిమెంట్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడం ..ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెగటివ్ కంటెంట్ క్రియేట్ అయ్యేలా చేస్తున్న ..నయనతార పై రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ బ్యూటీ మమతా మోహన్ దాస్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమతా మోహన్ దాస్ నయనతార పై షాకింగ్ కామెంట్స్ చేసింది . గతంలో ఆమె రజినీకాంత్ తో నటించిన ఓ సినిమాలో ఎడిటింగ్ లో మమతా మోహన్ దాస్ మొత్తం ఎగిరిపోవడానికి కారణం నయనతారనే అంటూ చెప్పుకొచ్చింది . ఆ విషయం లేటుగా తనకి అర్థమైంది అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. రజనీకాంత్ సినిమాలో మమతా మోహన్ దాస్ ఓ పాట చేసింది. ఈ క్రమంలోనే నాలుగు రోజులు ఎంతో కష్టపడి ఆ పాట ని షూట్ చేశారట . అయితే ఎడిటింగ్లో మాత్రం మమతా మోహన్ దాస్ ను పూర్తిగా లేపేసారు. దానికి కారణం నయనతారనే అంటూ ఆమె చెప్పుకొచ్చింది . “రజిని సార్ పక్కన వేరే హీరోయిన్ ఉంటే ..నేను నటించను అంటూ ఆమె చెప్పుకు రావడంతోనే ..పాటలో నన్ను తీసేశారు” అంటూ మమతా మోహన్ దాస్ ఎమోషనల్ అయింది. ఈ క్రమంలోనే నయనతార పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

Share post:

Latest