“ప్లీజ్ అన్న..తప్పు చేశాను క్షమించండి”.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సారీ చెప్పిన నాటు నాటు సింగర్ కాల భైరవ..ఏమైందంటే..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ – తారక్ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇద్దరు హీరోలు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ రావడమే అందుకు కారణం. 95 ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకుంది . ఆస్కార్ వేదికపై ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి..లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డు అందుకున్నారు . ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఆస్కార్ అవార్డు రాని ఇండియన్స్ కు ఇది చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఉండే సినీ ప్రేమికులు సంగీత ప్రియులు చరణ్ – తారక్ పేర్లను ట్రెండ్ చేస్తున్నారు . అయితే రీసెంట్గా ఈ సాంగ్ పాడిన వన్ ఆఫ్ ద సింగర్ కాలభైరవ చిక్కుల్లో ఇరుక్కున్నారు. సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్న కారణంగా తనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ అంటూ సుదీర్ఘమైన నోట్ లో రాసుకోచ్చారు. అయితే ఇందులో ఎక్కడా కూడా సినిమాకి సంబంధించి ఎన్నో ప్రమోషన్స్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరున ప్రస్తావించకపోవడంతో అభిమానులు హార్ట్ అయ్యారు .

కాలభైరవ పేరును ట్రోల్ చేస్తూ ఫైర్ అయ్యారు . దీనితో వెంటనే సారీ చెప్తూ కాలభైరవ స్పెషల్ మెసేజ్ షేర్ చేసారు. ” నాటు నాటు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విజయం తారక్ అన్న చరణ్ అన్న లే కారణమని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే అకాడమీ స్టేజ్ పై పెర్ఫార్మెన్స్ అవకాసం రావడానికి నా వైపుగా ఎవరెవరు హెల్ప్ చేశారు అన్నదాని గురించి మాత్రమే నేను మాట్లాడాను. దీని ద్వారా ఎవరైనా ఫ్యాన్స్ హార్ట్ అయి ఉంటే సారీ . ఇందుకు నా హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను ” అంటూ కాలభైరవ ట్వీట్ చేశాడు. దీంతో మేటర్ కూల్ అయ్యింది.

 

 

Share post:

Latest