`ద‌స‌రా` ఫ‌స్ట్ రివ్యూ.. నాని వారి చెంత చేర‌డం ఖాయమే!

న్యాచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో రూపుదిద్దుకున్న తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత‌మైన‌ ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో నేష‌న‌ల్ అవార్డ్ గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. తెలంగాణ .. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ ఇది.

పక్కా మాస్ లుక్ లో నాని అల‌రించ‌బోతున్నాడు. సముద్రఖని, దీక్షిత్ శెట్టి, సాయికుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 30న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజుమరియు కొంతమంది సినీ ప్రముఖులకు చూపించారు.

వారు ద‌స‌రా సినిమాను చూసి ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. వారి అంచ‌నాల‌కు మించి ఈ సినిమా ఉంద‌ట‌. ముఖ్యంగా నాని త‌న‌లోని మ‌రో కోణాన్ని చూపించాడ‌ని, ఊర మాస్ పాత్ర‌లో న‌ట‌నా విశ్వ‌రూపం చూపించాడ‌ని అన్నార‌ట‌. ఇది ఖ‌చ్చితంగా పాన్ ఇండియా రేంజ్ సెన్సేషన్ సృష్టించే సినిమా అని, నాని నటనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఫిదా అయిపోతార‌ని చెప్పార‌ట‌. అలాగే ద‌స‌రా త‌ర్వాత నాని పాన్ ఇండియా స్టార్స్ చెంత చేర‌డం ఖాయ‌మంటూ న‌మ్మ‌కం వ్య‌క్తం చేశార‌ట‌.

Share post:

Latest