తెల్ల బట్టల్లో సమంత.. మరో డేరింగ్ స్టెప్.. షాక్ అవుతున్న అభిమానులు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారుతూ.. తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన ప్రతి పోస్ట్ అక్కినేని కుటుంబానికి నెగిటివ్గా ఉంది అంటూ కొందరు ఆకతాయిలు కావాలని ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

కాగా రీసెంట్ గానే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ఇప్పుడిప్పుడే ఆ జబ్బు నుండి కోలుకుంటుంది . రీసెంట్ గానే ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సర్వం సిద్ధం చేసుకుంది . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే శాకుంతలం. మలయాళీ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శకుంతలా దేవి పాత్రలో సమంత కనిపించబోతుంది .

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది . కాగా నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అయి ఉండాల్సింది . కానీ అనుకోని కారణాల చేత ఈ సినిమా ఏప్రిల్ 14కి వాయిదా పడింది. కాగా సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి సమంత టీం రెడీ అయింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయించారు సమంత- దేవ్ మోహన్ తో పాటు దర్శకుడు . దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు సమంత.

కాగా సమంతను ఇలా తెల్ల బట్టల్లో చూసిన ఫాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు . చాలా ట్రెడిషనల్ దుస్తుల్లో సమంత – దేవమోహన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు . గుడిలో ఎంటరైన దగ్గర నుంచి ప్రతి ఫేమ్ లో చాలా అద్భుతంగా కనిపించారు ఈ జంట . ఈ సినిమా ఎలా అయినా సరే సూపర్ డూపర్ హిట్ అవుతుందని..సమంత ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడుతుంది అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు . కాగా చాలా రోజుల తర్వాత సమంత ఇంత హ్యాపీగా కనిపించడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి కొంతమంది ఇంత త్వరగా మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకోవడం పట్ల షాక్ అయిపోతున్నారు. ఫైనల్లీ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి సమంత సిద్ధమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

Share post:

Latest