అంద‌రి ముందు ఎత్తిన సీస దించ‌కుండా కల్లు తాగేసిన కీర్తి సురేష్‌.. వీడియో వైర‌ల్

మ‌హాన‌టి కీర్తి సురేష్ క‌ల్లు తాగేసింది. అది కూడా అంద‌రి ముందు ఎత్తిన సీస దించ‌కుండా గ‌ట గ‌టా లాగించేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అస‌లేం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ `ద‌స‌రా` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

న్యాచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

సౌత్ టూ నార్త్ ప్రధాన నగరాల్లో దసరాను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ప్రచార కార్యక్రమంలో నాని, కీర్తి సురేష్ ల‌తో పాటు ద‌గ్గుబాటి రానా కూడా పాల్గొన్నాడు. అయితే దసరా సినిమాలో మందు బాటిల్ ఎత్తితే దించకుండా తాగే సీన్స్ చేసిన‌ట్లుగా నాని తెలిపాడు. అలాగే ప్రమోషన్లలోనూ మరోసారి నాని ఇలాగే కల్లు తాగగా..రానా కూడా నాని స్టైల్లో కల్లు తాగేశాడు. దాంతో తానేం త‌క్కువ కాదు అన్న‌ట్లుగా అంద‌రి ముందు ఎత్తిన సీస‌ దించకుండా కల్లు తాగేసింది. అది చూసి నాని, రానాతో పాటు అక్క‌డి ఉన్న‌వారంతా షాకైపోయారు. దీంతో ఈ వీడియో కాస్త వైర‌ల్ గా మారింది.

Share post:

Latest