ఆర్ఆర్ఆర్ కంటే `పుష్ప 2`నే తోపా.. దుమారం రేపుతున్న న‌టుడి ట్వీట్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గ‌త‌ ఏడాది కాలం నుంచి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ రేసులోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా కంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప 2` తోపు అంటూ ప్రముఖ నటుడు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్‌` పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన‌ అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. దీంతో రెండో భాగంపై ఎన్నో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలోనే సుకుమార్ `పుష్ప 2`ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నాడు.

అయితే తాజాగా బాలీవుడ్ న‌టుడు క‌మ‌ల్ ఆర్ ఖాన్ `పుష్ప -2 అన్ని రైట్స్‌కు క‌లిపి అల్లు అర్జున్ 1050 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ రైట్స్ మాత్రం 750 కోట్ల‌కే అమ్ముడుపోయాయి. ఆర్ఆర్ఆర్ కంటే పుష్ప -2నే గొప్ప సినిమా అని అల్లు అర్జున్ భావిస్తోన్నాడు` అంటూ సెటైరిక‌ల్‌ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇత‌డి ట్వీట్‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే పుష్ప 2 గొప్ప సినిమా అవుతుంద‌ని కొంద‌రు అంటుంటే.. అంత్ సీన్ లేద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

Share post:

Latest