జ‌క్క‌న్న వ‌ల్ల `ఆర్ఆర్ఆర్‌` హీరోలు ఎన్ని కోట్లు న‌ష్ట‌పోయారో తెలిస్తే షాకే!?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` పాట‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా పాటగా `నాటు నాటు` చరిత్ర సృష్టించింది. అయితే `ఆర్ఆర్ఆర్‌`కు ఆస్కార్ అవార్డు అంత సుల‌భంగా ఏమీ రాలేదు. దాని వెన‌క రాజ‌మౌళి కృషి ఎంతో ఉంది.

గత మూడు నెల‌ల నుంచి `ఆర్ఆర్ఆర్‌`ను అమెరికాలో ఏ స్థాయిలో ప్ర‌మోట్ చేశారో తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా త‌మ నెక్స్ట్ ప్రాజెక్ట్ ల‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ ఆస్కార్ కోసం క‌ష్ట‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే జ‌క్క‌న్న వ‌ల్ల `ఆర్ఆర్ఆర్‌` హీరోలు కోట్లు న‌ష్ట‌పోయారు. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఎంత బిజీ స్టార్స్ అన్న‌ది చెప్ప‌క్క‌ర్లేదు.

రోజుకు వీరి రెమ్యున‌రేష‌న్ నాలుగు కోట్ల రేంజ్ లో ఉంటుంది. పైగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌ను లైన్ లో పెట్టి ఉన్నారు. అయినా స‌రే జ‌క్క‌న కోసం గ‌త కొద్ది నెల‌ల నుంచి అమెరికాలోనే ఉంటూ `ఆర్ఆర్ఆర్‌`ను భారీ స్థాయిలో ప్ర‌మోట్ చేశారు. ఫ‌లితంగా ఈ ఇద్ద‌రు హీరోలు ఏకంగా అర‌వై నుంచి డ‌భై కోట్ల రూపాయిల‌ను న‌ష్ట‌పోయార‌ని ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.