`ద‌స‌రా`ను భ‌య‌పెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌.. బ‌ల‌వుతారా? బ‌య‌ట‌ప‌డ‌తారా?

న్యాచుర‌ల్ నాని కెరీర్ తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా`. ఇంద‌లో ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్‌, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ నానికి జోడీగా న‌టించింది. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకత్వం వ‌హించ‌గా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మ‌రింత హైప్‌ను పెంచుతున్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు ఈ సినిమాను ఓ బ్యాడ్ సెంటిమెంట్ బాగా భ‌య‌పెడుతోంది.

దసరా చిత్రాన్ని నిర్మించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఓ దారుణమైన రికార్డు ఉంది. ఈ సంస్థ అధినేత సుధాకర్ చెరుకూరి ఇప్ప‌టి వ‌రకు ఐదు చిత్రాలు నిర్మించారు. అయితే ఆ చిత్రాల‌న్నీ బ్యాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. ఈ లిస్ట్ లో లయన్, పడి పడి లేచె మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ, విరాట‌ప‌ర్వం వంటి చిత్రాలు ఉన్నాయి. దీంతో సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా ఉంటే ఈ సినిమా ఫ్లాపే అన్న బ్యాడ్‌ సెంటిమెంట్ ఏర్ప‌డింది. ఇప్పుడు ఈ బ్యాక్ సెంటిమెంట్ కు నాని ద‌స‌రా కూడా బ‌ల‌వుతుందా..? లేక బ‌య‌ట‌ప‌డి రికార్డులు తిర‌గ‌రాస్తుందా..? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Share post:

Latest