ఓటీటీలోనూ వీర‌సింహారెడ్డి రికార్డుల వేట‌… బాల‌య్య ఆట మామూలుగా లేదుగా…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన వీర సింహారెడ్డి.. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా రెండు సినిమాలు కూడా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

వీర సింహారెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే ఎప్పుడూ లేనట్టుగా తొలిరోజే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అసలు ఈ సినిమాకి తొలి రోజు ఈ విధంగా కలెక్షన్లు రావటంతో ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్‌ అయింది. బాలయ్య గత సినిమా అఖండను మించిన సెన్సేషనల్ హిట్‌గా వీర సింహారెడ్డి నిలిచింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

తెలుగులోనే కాకుండా భారతీయ అన్ని భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన తొలి నిమిషం నుంచే భారీ రికార్డులను అందుకోవటం మొదలుపెట్టింది. ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన ఒక నిమిషంలోనే ఏకంగా1.50 లక్షలకు పైగా యూనిక్ వ్యూస్ ను రాబట్టింది. ఈ విధంగా వీర సింహారెడ్డి అటు థియేటర్లో ఇప్పుడు ఓటీటీ లోను కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.

Share post:

Latest