చిరంజీవికే సవాల్ విసిరిన మెగా కోడలు పిల్ల.. ఉపాసన ఇంత మొండి ఘటమా..!?

సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలే కాదు ..వారి భార్యలు కూడా సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ..ముందుకు దూసుకెళ్తున్నారు . మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి .. రామ్ చరణ్ భార్య ఉపాసన ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే . వాళ్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఫాన్స్ కు కొత్త బూస్టప్ ఇస్తూ ఉంటారు . కాగా రీసెంట్ గానే మెగాకోడలు ఉపాసన తల్లి కాబోతుందన్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశారు .

గత పదేళ్ళుగా ఎప్పుడెప్పుడు ఈ గుడ్ న్యూస్ వింటామా అంటూ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేసిన మెగా అభిమానులకు ఆ న్యూస్ పండగల అనిపించింది . ఈ క్రమంలోనే ఉపాసన గర్భం దాల్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె పేరు మరింత రేంజ్ వైరల్ గా మారింది . రకరకాల వార్తలు మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెన్సీ పై వైరల్ అవుతూనే ఉన్నాయి. ఓసారి సరోగసి అని.. ఓసారి ట్విన్స్ మరోసారి ఇంకో వార్త ..ఇలా మెగాకోడలు ఉపాసనపై నానా రకాలుగా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది . కాగా రీసెంట్గా మెగాకోడలు ఉపాసన ..మెగా స్టార్ చిరంజీవికే సవాల్ విసిరింది అంటూ ఓ న్యూస్ సినీ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది .

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తన వారసుడుగా రాంచరణ్ ఇంట్రడ్యూస్ చేశాడు . ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా తన వారసుడిగా తన కొడుకుని ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేయాలని అభిమానులు ఆశపడుతున్నారు . అయితే మెగా కోడలు ఉపాసన పుట్టబోయే బేబీని ఇండస్ట్రీలోకి తెచ్చే ఆలోచన లేదట . డాక్టర్ చేయాలని నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటుందట . ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ ఆశల మీద నీళ్లు చల్లింది ఉపాసన. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని ఒప్పుకోనే ఒప్పుకోలేదట .

కచ్చితంగా చరణ్ బిడ్డ ఇండస్ట్రీలో సినిమాలు చేయాలి.. డాక్టర్ చదువు చదివిన తర్వాత అయినా సరే సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ లెగిసిని కంటిన్యూ చేయాలి అంటూ చెప్పుకోచ్చారట .ఈ క్రమంలోనే ఉపాసన కూడా నా బిడ్డను నా ఇష్టప్రకారమే చదివించుకుంటాను అంటూ చరణ్ తో తెగేసి చెప్పిందట . దీంతో పరోక్షంగా ఉపాసన ..చిరంజీవి మాటలను ఎదిరించినట్లైంది. ఈ క్రమంలోని మెగాకోడలు ఉపాసన మెగాస్టార్ మామ కి సవాల్ విసిరింది అంటూ సినీ వర్గాల్లో ఉండే జనాలు చెప్పుకుంటున్నారు . అంతేకాదు ఉపాసనాని కొందరు సపోర్ట్ చేస్తుంటే ..మరి కొందరు చిరంజీవిని సపోర్ట్ చేస్తున్నారు . చూడాలి మరి పుట్టబోయే బిడ్డ సినిమా ఇండస్ట్రీలోకి వస్తాడో..? డాక్టర్ గా చదువుకొని అటువైపుగా అడుగులు వేస్తాడో..?. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

Share post:

Latest